
తేది : 17.05.2026
స్థలం: విజయవాడ
విషయం: జనన రేటును కోల్పోయిన హిందువులకు మాత్రమే జనన ప్రోత్సాహక పథకం వర్తించేలా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇద్దరికన్నా అధిక సంతానం కన్న తల్లిదండ్రులకు ప్రోత్సాహకం ఇస్తామని, మూడో బిడ్డను కంటే ముప్పై వేలు, నాలుగో బిడ్డను కంటే నలబై వేలు, ఐదో బిడ్డను కంటే ఏబై వేలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. AP లో జననాల రేటు 1.5% మాత్రమే ఉన్నందున ఈ చర్యలు చేపట్టడాన్ని విశ్వ హిందూ పరిషత్ స్వాగతిస్తున్నది. కానీ గత 50 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చెప్పిన మాటను నమ్మి హిందూ సమాజము ఇద్దరైతే ముద్దు ముగ్గురు వద్దు అని చెప్పడం వల్ల మూడో బిడ్డని కనలేదు. ఆ తరవాత ప్రభుత్వం ఒకరైతే ముద్దు ఇద్దరి మించి వద్దు అని మరలా చెప్పడం వల్ల ఒక బిడ్డకే పరిమితమైన హిందూ సమాజము జననాల రేటును పూర్తిగా కోల్పోయింది. అదే సందర్భంలో ముస్లిం సమాజం బహు భార్యత్వం మరియు అధిక సంతానం కారణంగా తమ జనాభా రేటు 50% పైగా పెంచుకున్నది. ఈ సందర్భంలో ప్రభుత్వ మాటలు నమ్మడంవల్ల తగ్గిపోతున్న హిందువుల జనన రేటును పెంచడానికి మీ ప్రకటన ఉపయోగపడాలి. కానీ మీ ప్రకటనలో స్పష్టత లేని కారణంగా ఇప్పటికే అధిక సంతానం కంటున్న ముస్లిం సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారనే భావన హిందూ సమాజానికి మరియు విశ్వ హిందూ పరిషత్తుకు కలుగుచున్నది. జనన రేటును కోల్పోయిన హిందువులకు మాత్రమే ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా హిందూ సమాజం మాత్రమే జనన రేటును కోల్పోతున్నది. దీనికి కారణం ప్రభుత్వాలు చెప్పిన జనభా నియంత్రణను హిందువులు మాత్రమే తూచా తప్పకుండా అమలు చేయడం వల్ల ఈ దుస్థితి ప్రాప్తించింది. కావున జనన రేటు పెరగవలససినది హిందూ సమాజంలో అని విశ్వ హిందూ పరిషత్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నది. అధిక సంతానాన్ని కంటే అధిక ప్రోత్సాహకాలు హిందువులకు మాత్రమే వర్తించేలా ఈ ప్రకటన చేయాలని, లేకుంటే ఈ ప్రకటన సమాజ సమతుల్యతను పూర్తిగా దెబ్బతీస్తుందనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి విశ్వ హిందూ పరిషత్ తీసుకు వచ్చుచున్నది. అధిక సంతానం పేరుతో ముస్లిం సమాజం, మతమార్పిడుల పేరుతో క్రైస్తవ సమాజం తమ జనాభా రేటును దేశ వ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా పెంచుకుంటున్నది. ప్రభుత్వ సూచనను పాటించే హిందూ సమాజం జనన రేటును కోల్పోయింది. కావున హిందూ సమాజానికి మాత్రమే వర్తించేలా ఈ ప్రోత్సాహకాలను అమలు చేయాలని విశ్వ హిందూ పరిషత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
తనికెళ్ళ సత్య రవికుమార్
కార్యదర్శి
VHP భాగ్యనగర్ క్షేత్రం




