
తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆగస్టు–2026 నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించింది. భక్తులు ఆన్‌లైన్ ద్వారా ముందస్తుగా టికెట్లు, సేవలు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన టికెట్ల కోటాను మే 18 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ సేవలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ నమోదు మే 20 ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఎంపికైన భక్తులు మే 20 నుండి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు చెల్లింపులు పూర్తి చేస్తే టికెట్లు మంజూరు అవుతాయి.
మే 21న ప్రత్యేక సేవల టికెట్లు
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవ సేవల టికెట్లు మే 21 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
అదే రోజు వార్షిక పవిత్రోత్సవాలు (23-08-2026 నుండి 25-08-2026 వరకు) టికెట్లను కూడా విడుదల చేస్తారు.
వర్చువల్ సేవలు
వర్చువల్ సేవలు మరియు వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను మే 21 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
మే 23న విడుదలయ్యే కోటాలు
ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల కోటా
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 25 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
తిరుమల, తిరుపతిలో గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
భక్తులు అధికారిక టీటీడీ వెబ్‌సైట్ అయిన టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సూచించారు.




