News

మతపరంగా రెచ్చగొట్టే వార్తలు వ్యాప్తి చేస్తే చర్యలు

8views

మత పరంగా రెచ్చగొట్టే వార్తలు వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవని కడప జిల్లా  ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ఒక పత్రికా ప్రకటనలో హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. కొంతమంది దుండగులు, బాధ్యతారహిత వ్యక్తులు సోషల్‌ మీడియా వేదికగా పుకార్లు, తప్పుడు వార్తలు, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులను ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్‌ను సృష్టించడం, పోస్టు చేయడం, ఫార్వర్డ్‌ చేయడం లేదా షేర్‌ చేయడం చేసిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రెచ్చగొట్టే పోస్టులు ఉంటే కడప పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు, 112 నంబర్‌కు లేదా సమీప పోలీస్‌ స్టేషన్‌న్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. సోదరభావం, శాంతియుత జీవనానికి ప్రతీకగా కడపకు గొప్ప చరిత్ర ఉందన్నారు. అన్ని వర్గాలవారు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.