News

గుంటూరు విభాగ్ కార్యాలయ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ

35views

గుంటూరు నగరంలోని NGO కాలనీ 4వ లేన్‌లో గుంటూరు విభాగ్ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో, ఘనంగా నిర్వహించబడింది. వేదమంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ భూమి పూజ కార్యక్రమం హిందూ సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణ మరియు సంఘటిత కార్యాచరణకు నూతన దిశను సూచించే సందర్భంగా నిలిచింది.

ఈ పుణ్య కార్యక్రమంలో గుంటూరు విభాగ్ సంఘచాలక్ డా. KSN చారి జీ, విభాగ్ కార్యవాహ్ శ్రీ గోలి రామారావు గారు పాల్గొని భూమి పూజ నిర్వహించారు. భారతీయ సంస్కృతి, హిందూ చైతన్యం మరియు సేవా భావంతో నిర్మితమవుతున్న ఈ కార్యాలయం సమాజోద్ధరణకు కేంద్ర బిందువుగా నిలవాలని వారు పేర్కొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రాంత ప్రచారక్ శ్రీ ఆదిత్య గారు, ప్రాంత కార్యవాహ్ శ్రీ వేణుగోపాల నాయుడు గారు, విభాగ్ సహ సంఘచాలక్ డా. రఘురామిరెడ్డి గారు హాజరై కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్రేరణాత్మక సందేశాలు అందించారు. సమాజంలో హిందూ ఐక్యత, సేవా కార్యక్రమాలు మరియు సంస్కార పరిరక్షణలో కార్యాలయాల ప్రాముఖ్యతను విశదీకరించారు.


ఈ సందర్భంగా ఆదరణీయ క్షేత్ర సహ సంఘచాలక్ శ్రీ దూసి రామకృష్ణ గారు మార్గదర్శనం చేస్తూ, సంఘ కార్యం అనేది కేవలం సంస్థాపరమైనది మాత్రమే కాకుండా, హిందూ సమాజ ఆత్మను బలపరిచే యజ్ఞమని పేర్కొన్నారు. సమాజంలో సేవ, సంస్కారం, సంఘటిత శక్తి పెంపొందించేందుకు ప్రతి కార్యకర్త కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

అలాగే వివిధ క్షేత్రాల నుంచి విచ్చేసిన జ్యేష్ఠ స్వయంసేవకులు, ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. భవిష్యత్ తరాలకు ధార్మిక, సాంస్కృతిక విలువలను చేరవేసే దిశగా ఈ కార్యాలయం సేవలందించాలనే ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు.

భక్తి, దేశభక్తి మరియు సేవా భావాల సమ్మిళితంగా జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమం నూతన ఉత్సాహాన్ని నింపింది. భవిష్యత్తులో గుంటూరు విభాగ్ కార్యాలయం సమాజహితం కోసం అనేక సేవా, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలవాలని అందరూ ఆకాంక్షించారు.