
వివాహితులైన ముస్లిం మహిళల హక్కులకు సంబంధించి అహ్మదాబాద్ కుటుంబ న్యాయస్థానం కీలకమైన తీర్పు వెలువరించింది. భర్త అనుమతించక పోయినప్పటికీ భార్య విడాకులు (ఖులా) ఇవ్వవచ్చని తెలిపింది. అయితే, ఈ విడాకులకు చట్టబద్ధత రావాలంటే ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ వివాదంలో జోక్యం చేసుకునే అధికారం షరియత్ కౌన్సిల్ కు లేదనీ పేర్కొంది. ముస్లిం దంపతులలో భర్త ఇచ్చే విడాకులను తలాఖ్ అంటారు. వైవాహిక జీవితంలో భర్త నుంచి విడిపోవాలనుకునే మహిళకు ఖులా ఇచ్చే వెసులుబాటు ఉంది. 2019లో వివా హమైన ఆ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. నేర చరిత్రను దాచి పెట్టి తనను భర్త మోసం చేశాడని, నిత్యం వేధిస్తున్నాడని కలత చెందిన మహిళ.. 2023లో భర్త ఇంటి నుంచి వచ్చేసింది. 2024లో ఖులా పత్రాన్ని పంపించింది. వివాహ సమయంలో భర్త నుంచి తీసుకున్న కట్నం, ఆభరణాలు తిరిగి ఇచ్చే సింది. క్యాన్సర్ సోకిన భర్తకు ఆ వ్యాధి నయమయ్యే వరకూ సేవలందించి అతను పూర్తిగా కోలుకున్నాకే విడిపోయింది. దీనికి సంబంధించిన ఆధారాల న్నింటినీ ఆమె కుటుంబ న్యాయస్థానానికి సమర్పించింది. దీంతో భర్త అభ్యం తరాలను కోర్టు తోసిపుచ్చి ఆమె విడాకుల నిర్ణయాన్ని సమర్థించింది. ముస్లిం వివాహ ముగింపు చట్టం-1939 ప్రకారం ఆమెకున్న హక్కును నిర్ధారించింది.



