
36views
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మోదకొండమ్మ అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగను ఈ నెల 17, 18, 19 తేదీలలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. పాడేరు కలెక్టర్ కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర ప్రచార పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశముందని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, ఆహారం, పారిశుధ్యం, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అదనంగా 100 ప్రత్యేక బస్సులు నడిపిస్తూ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు.





