
నంద్యాలలోనిశ్రీ రామకృష్ణా పీజీ కళాశాల ఆడిటోరియంలోలో “హిందూ మహిళలు కార్యాలయాల్లో, విద్యాలయాల్లో ఎదుర్కొంటున్న సవాళ్లు – పరిష్కార మార్గాలు” అనే అంశంపై నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి లైఫ్ హాస్పిటల్ వ్యవస్థాపకులు, ప్రముఖ స్త్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ లక్ష్మీ సౌజన్య గారు అధ్యక్షత వహించగా, ప్రముఖ అనెస్తీషియా నిపుణులు డాక్టర్ శేషఫణి గారు, శ్రీ ఎలుకూరి సురేశ్ గారు వేదికను అలంకరించారు. జ్యోతి ప్రజ్వలన, పూజ కార్యక్రమాల అనంతరం సభాధ్యక్షులు కార్యక్రమ ఉద్దేశ్యం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రత, వాటి పరిష్కార దిశగా సమాజం తీసుకోవాల్సిన బాధ్యతను వివరించారు.
తదుపరి సభికులు మహిళల భద్రత, గౌరవం, విద్యా మరియు ఉద్యోగ రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లపై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ, వివిధ పరిష్కార సూచనలు చేశారు. ఇప్పటికే ఈ అంశాలపై పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు సమస్యల ప్రాముఖ్యతను వివరించి, కేవలం చైతన్య కార్యక్రమాలు మాత్రమే కాకుండా యోజనాత్మక శిక్షణా కార్యక్రమాలు అత్యవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు మరియు పెద్దలు పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. జాతీయ ప్రాముఖ్యత గల ఈ అంశాలపై తమ సహకారం కొనసాగుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమ నిర్వహణలో డాక్టర్ కె. ఉదయ శంకర్, డాక్టర్ నేట్ల మహేశ్వర రెడ్డి, డాక్టర్ (మేజర్) సంతోష్, శ్రీ గెలివి శ్రీకాంత్, శ్రీ చాటకొండ శ్రీకాంత్, శ్రీ వల్లంకొండ సంపత్, శ్రీ యాతం చంద్ర, శ్రీ రమేష్ రెడ్డి తదితరులు కీలక పాత్ర పోషించారు. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు.
జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది.





