
గుంటూరు జిల్లా నూతక్కి గ్రామంలోని జ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణంలో 01 మే 2026న రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల సంయుక్త సంఘ శిక్షావర్గ (విశేష) ఉద్ఘాటన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ శిక్షావర్గానికి వర్గ సర్వాధికారిగా చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది, జిల్లా సంఘచాలకులు శ్రీ సి.కే. రఘు గారు వ్యవహరిస్తున్నారు. వర్గ కార్యవాహగా సంగారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ ప్రాంత సద్భావ కార్య సంయోజక్ శ్రీ నల్లాన్ చక్రవర్తుల రామకృష్ణ గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే వర్గ పాలక్ అధికారిగా అనంతపురం జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ ప్రాంత సహ కార్యవాహ శ్రీ మాలపాటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు.
ఉద్ఘాటన కార్యక్రమంలో శ్రీ మాలపాటి శ్రీనివాసరెడ్డి గారు శిక్షార్థులకు 15 రోజులపాటు నిర్వహించబడే శిక్షణా విధానం, దాని లక్ష్యాలు, క్రమశిక్షణ మరియు వ్యక్తిత్వ వికాసంపై మార్గదర్శనం చేశారు.

ఈ శిక్షావర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 63 మంది, తెలంగాణ నుంచి 44 మంది శిక్షార్థులు పాల్గొంటూ, మొత్తం 107 మంది వివిధ జిల్లాల నుంచి హాజరయ్యారు. ఈ శిక్షణ శిబిరం ద్వారా స్వయంసేవకులలో సేవాభావం, దేశభక్తి మరియు నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమం ప్రాంతీయ స్థాయిలో సంఘ కార్యకలాపాలకు మరింత బలం చేకూర్చే దిశగా ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.





