News

సనాతన ధర్మంతో నైతిక విలువల పెంపు

6views

సనాతన ధర్మంలోని నైతిక విలువలు ఆధునిక సమాజానికి అవసరమైన మానవీయ విలువలను అందిస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. ఏలూరు జిల్లా  ద్వారకాతిరుమల మండలంలో ఆయన  పలు కార్యక్రమాల్లో  పాల్గొన్నారు. కోడిగూడెంలో విఘ్నేశ్వర ఆలయ శంకుస్థాపన, సీహెచ్‌ పోతేపల్లిలో జరిగిన భార తీయ నాగరికత, సనాతన ధర్మ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. అనంతరం పలుగ్రామాల్లో మన ఊరు మన జెండా కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ చేశారు. సీహెచ్‌ పోతేపల్లి సదస్సులో ఆయన మాట్లాడుతూ భారతీయ నాగరికతకు సనాతన ధర్మం ఆధ్యాత్మిక మూలమన్నారు. ఇది మానవుని ఉన్నతమైన జీవనానికి ఆత్మసాక్షాత్కా రానికి నడిపించే ఓ మార్గదర్శిగా వివరించారు. భారతీయ నాగరికతకు ఇది వెన్నుముక వంటిదన్నారు. సత్యసాయి సంస్థల అధినేత చెలికాని సోంబాబు, చెలికాని కిషోర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.