
34views
అండమాన్ నికోబార్ దీవులు అరుదైన కార్యక్రమానికి వేదికయ్యాయి. ఇక్కడి రాధానగర్ బీచ్‌లో భారీ జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమాన్ని స్థానిక పాలనాధికారులు చేపట్టారు. నీటి అడుగున అతిపెద్ద జెండాను ఎగురవేసి గిన్నిస్ రికార్డును నెలకొల్పారు. 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పుతో ఈ జెండాను రూపొందించడం విశేషం.
స్థానిక పోలీసులు, అటవీశాఖ, నేవీ, కోస్ట్‌గార్డ్ తదితర విభాగాల సమన్వయంతో ఈ జెండాను ఎగురవేశారు. ఇందులో ముగ్గురు పాఠశాల విద్యార్థులతో పాటు దాదాపు 200 మంది శిక్షణ పొందిన ఈతగాళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి లెఫ్టినెంట్ జనరల్ డీకే జోషి, చీఫ్ సెక్రటరీ చంద్రభూషణ్ కుమార్, డీజీపీ ధాలివాల్ సహా పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు.



