News

ఇకపై యాప్‌లో కాశీ విశ్వనాథుని దర్శనం!

48views

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయంలో భక్తుల సౌకర్యార్థం శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టు ఓ యాప్‌ ఆధారిత దర్శన విధానాన్ని ప్రవేశపెట్టనుంది. భాషా అవరోధాలు, ప్రాంతీయ భేదాల కారణంగా భక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో ఈ నూతన విధానం సహాయపడుతుందని ట్రస్ట్‌ సీఈవో విశ్వ భూషణ్‌ మిశ్ర విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ నెల 1 నుంచి మొదలైన ఈ ప్రణాళికను దశల వారీగా అమలుచేయనున్నట్లు ఆయన తెలిపారు. దీని ప్రకారం.. సుగమ దర్శనం, అభిషేకం వంటి ప్రత్యేక పూజా సేవలను కోరుకునే భక్తులు ఆధార్‌ వివరాలతో సహా ప్రాథమిక సమాచారం అందించాల్సి ఉంటుంది. అధికారుల వద్ద సందర్శకుల ప్రాథమిక సమాచారం పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది.