News

జూన్‌ నుంచి ఆగస్టు మధ్య కైలాశ్‌- మానసరోవర్‌ యాత్ర

4views

హిందువులకు అత్యంత పవిత్రమైన కైలాశ్‌-మానసరోవర్‌ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య నిర్వహించనున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ యాత్ర ప్రధానంగా రెండు మార్గాల ద్వారా సాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ మార్గం ద్వారా ట్రెక్కింగ్ చేసే యాత్రికులకు అవకాశం ఉంటుంది.

సిక్కింలోని నాథులా నుంచి వాహనాల ద్వారా ప్రయాణించే వారికి ఈ మార్గం అనువైనది. బృందాల వివరాలు, ఎంపిక మొత్తం యాత్రను క్రమబద్ధంగా నిర్వహించేందుకు ఎంఈఏ ఏర్పాట్లు చేసింది. రెండు మార్గాల నుంచి కలిపి మొత్తం 20 బృందాలు ఈ యాత్రలో పాల్గొంటాయి. ఒక్కో బృందంలో గరిష్ఠంగా 50 మంది యాత్రికులను అనుమతిస్తారు.

దరఖాస్తు చేసుకున్న వారిలో కంప్యూటరైజ్డ్ డ్రా (లాటరీ) పద్ధతి ద్వారా యాత్రికులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆసక్తిగల యాత్రికులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ కోసం విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేకంగా kmy.gov.in వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.ఈ నెల 19వ తేదీ లోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు కనీసం 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరులై ఉండాలి. అలాగే గరిష్ఠ వయోపరిమితి 70 ఏళ్లుగా నిర్ణయించారు. యాత్రకు ముందు కఠినమైన వైద్య పరీక్షలు నిర్వహించి, శారీరక దృఢత్వం ఉన్నవారినే అనుమతిస్తారు. హిమాలయాల్లోని కఠినమైన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాత్రికులు ముందస్తుగా సిద్ధం కావాలని అధికారులు సూచించారు.