News

మలేసియాలో ఉద్యోగాలంటూ మహిళా టెకీలకు నిదాఖాన్‌ ట్రాప్‌

27views

మహారాష్ట్రలోని నాసిక్‌ టీసీఎ్‌సలో వెలుగుచూసిన రాకెట్‌కు సూత్రధారిగా భావిస్తున్న నిదా ఖాన్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. ఈ వ్యవహారంలో నిదా ఖాన్‌ పాత్రను తెలిపే కీలక ఆధారాలను ఈ సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించారు. బాధితురాలైన మహిళా టెకీకి నమాజ్‌ చేయడం, హిజాబ్‌ ధరించడం నిదా ఖాన్‌ నేర్పించారని తెలిపారు. ‘‘మత మార్పిడి ప్రయత్నాల్లో భాగంగా బాధితురాలి పేరును హనియాగా నిదాఖాన్‌ మార్చారు. మలేసియాలో ఉద్యోగం ఇప్పిస్తానని, మంచి జీవితం గడపొచ్చంటూ ఆశపెట్టి ఆమె మతం మార్చేందుకు ప్రయత్నించారు. తన మాట వినకపోతే నీ కుటుంబం ఇబ్బందులు పడుతుందని బెదిరించారు’’ అని వివరించారు. నిదా ఖాన్‌ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరారు.