News

మత మార్పిళ్ల కోసం అమెరికా ‘నిధులు’’.. పక్కా ఆధారాలతో ఈడీ

35views

మన దేశంలో అక్రమ మత మార్పిళ్లు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక చోట అక్రమ మతమార్పిళ్ల వార్తలు వింటూనే వున్నాం. మరీ ముఖ్యంగా గిరిజనులు వున్న చోట్ల, ఛత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాల్లో మరీ విపరీతంగా జరుగుతున్నాయి. వీటికి విరుగుడుగా విశ్వహిందూ పరిషత్, ధర్మ జాగరణ్ లాంటి సంస్థలు, ఇతర హిందూ సంస్థలు ‘‘ఘర్ వాపసీ’’ పేరుతో ఎప్పటికప్పుడు వారికి మన హిందూ మతం గొప్పదనం చెప్పి, తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొస్తున్నాయి.

అయితే.. అసలు వీరు ఎందుకు మారుతున్నట్లు అని ప్రతి సాధారణ పౌరునిగా సందేహాలు వస్తుంటాయి. అలాగే ఇలా అక్రమ మత మార్పిళ్లు చేసి, హిందూ ధర్మాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయాలని విదేశీ శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని, అందుకు విదేశీ శక్తులు నిధులు కూడా సమకూరుస్తుంటాయని మనం చాలా సార్లు విన్నాం. కానీ.. ఈ సారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాత్రం విదేశీ నిధులు ఇందుకు వస్తున్నాయని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, ధ్రువీకరించింది. దీంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అక్రమ మత మార్పిళ్లు చేస్తూ, అమెరికాతో ప్రత్యక్ష సంబంధాలున్న క్రైస్తవ మిషనరీ ముఠాను ఈడీ ఛేదించింది. అంతేకాకుండా ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో మత మార్పిడులను సులభతరం చేయడానికి ఈ నిధులను అక్కడికి మళ్లించారని కూడా వెలికి తీసింది.

అమెరికాకు చెందిన మిషనరీ సంస్థ “ది తిమోతి ఇనిషియేటివ్” (TTI)తో సంబంధం కలిగి, దేశ వ్యాప్తంగా సుమారు 95 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మోత్తం 95 కోట్లలో 6.5 కోట్లు కేవలం ఛత్తీస్ గఢ్ లోని ధమ్తరి, బస్తర్ ప్రాంతాలకే పంపించారని కూడా ఈడీ తేల్చింది.

ఈడీ దర్యాప్తును కాస్త పక్కన పెడితే, బస్తర్ పూర్తిగా నక్సల్స్ వుండే ఏరియా (ఆపరేషన్ కగార్ తో ఇప్పుడు నక్సల్స్ రహితంగా మారింది)కాగా, ధమ్తరి పాక్షికంగా నక్సల్స్ కి పట్టున్న ప్రాంతం. చాలా సంవత్సరాల వరకు ఇక్కడ రహదారులు, విద్యుత్ సౌకర్యాలు కూడా వుండేవి కావు. కానీ.. అక్కడ చర్చిలు వెలిశాయి, పాస్టర్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డారు.మావోయిస్టుల హింసతో అట్టుడికపోయే ఈ ప్రాంతాల్లో అక్కడి స్థానికులు వెళ్లడానికి కూడా కాస్త జంకేవారు. కానీ.. క్రైస్తవ మిషనరీలు మాత్రం అక్కడికి ఎలా వెళ్లగలిగాయి? నిర్భయంగా ఎలా సంచరించేవారు? ఎవరి ఇళ్లల్లో వుండేవారు, మావోలు వారికి సహకరించేవారా? అన్న ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తారు. అలాగే క్రైస్తవ మిషనరీలకు, మావోలకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా సాగేవా? అన్న అనుమానాలు కూడా వస్తుంటాయి.

ఇక.. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ‘TTI’ అనే సంస్థ మొత్తం ₹95 కోట్ల విలువైన లావాదేవీలను నిర్వహించింది; దేశంలో క్రైస్తవ మత ప్రచార, మత మార్పిడి కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఆ సంస్థ ఈ మొత్తాన్ని వినియోగించుకుంది. బస్తర్ మరియు ధమతరి ప్రాంతాలలో ₹6.5 కోట్లు ఖర్చు చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. విదేశీ బ్యాంకు డెబిట్ కార్డులను ఉపయోగించి భారతదేశంలో పదేపదే నగదును విత్‌డ్రా చేస్తున్నట్లు కూడా ఈ దర్యాప్తులో వెల్లడైంది.

విదేశీ డెబిట్ కార్డుల ద్వారా భారత్ లోకి తరలివస్తున్న నిధులపై దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈ నెల 128,19 తేదీలలో ఈడీ పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సమయంలోనే అమెరికా హస్తముందని బయటపడింది.ఈ ఆపరేషన్ సమయంలో, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ‘మికా మార్క్’ అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 25 విదేశీ డెబిట్ కార్డులను మరియు ₹40 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అమెరికాకు చెందిన ‘Truist Bank’ డెబిట్ కార్డులను భారతదేశానికి తీసుకువచ్చి, వాటిని ఉపయోగించి ATMల ద్వారా నిరంతరాయంగా నగదును తీసేవారని కూడా ఈడీ తన పత్రికా ప్రకటనలో పేర్కొంది., రణలు జరిపారు. గత కొన్నేళ్లుగా, ఛత్తీస్‌గఢ్‌లోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో ఈ కార్డులను ఉపయోగించి భారీ మొత్తంలో నగదును “అసాధారణ” మరియు “సందేహాస్పద” రీతిలో విత్ డ్రా చేశారని కూడా పేర్కొంది.ఈ నిధులు, క్రైస్తవ మత ప్రచారం మరియు విస్తరణ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న ‘The Timothy Initiative’ అనే మిషనరీ సంస్థతో ముడిపడి ఉన్నాయని కూడా ఈడీ ప్రకటించింది.

ఆ సంస్థ, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) కింద నమోదు కానప్పటికీ, భారతదేశంలోని తన ఖర్చుల కోసం ఈ నిధులను వినియోగించుకుందని ఈడీ తెలిపింది.అంతేకాకుండా ఈ నిధులు ఇంకా ఏయే అవసరాలకు ఉపయోగించారో కూడా వెలికి తీసే పనిలో ఈడీ నిమగ్నమైంది.