News

నంద్యాలలో నిరసన ర్యాలీ : “కార్పొరేట్ జిహాద్” పై విశ్వ హిందూ పరిషత్, భజరంగదళ్ ఆందోళన

79views

విశ్వ హిందూ పరిషత్ మరియు భజరంగ దళ్ ఆధ్వర్యంలో నంద్యాలలో నిరసన ప్రదర్శన నిర్వహించబడింది. మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఒక సాఫ్ట్వేర్ సంస్థకు సంబంధించిన ఘటనపై స్పందిస్తూ ఈ ఆందోళన చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

సంఘటనలో భాగంగా హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు, మత మార్పిడులకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, నంద్యాలలో కూడా ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నిరసనకారులు స్థానిక డీఎస్పీకి వినతిపత్రం అందజేసి, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, యువతుల భద్రతపై కుటుంబాలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నప్పటి నుంచే ఆత్మరక్షణ శిక్షణలు, నైతిక విలువలపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే పిల్లల స్నేహితులు, వారి పరిచయ వర్గాలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.