
రైలు బోగీనీ ఆలయంగా మార్చేసి పూజలు చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ రైల్వేకి సంబంధించిన కోచ్‌లో మతపరమైన కార్యకలాపాలు, భద్రతా ఆందోళనలపై చర్చకు దారి తీసింది. ప్రయాణికులు ఒక స్లీపర్ బెర్త్ పూజా మందిరంగా చేసి, కాషాయ వస్త్రాలు, పూలమాలలు, దేవతా విగ్రహాలతో అలంకరించి, కదులుతున్న రైలులోనే హారతుల్విడం ఆ వీడియోలో చూడవచ్చు.
భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ‘భారత్ గౌరవ్’ అనే థీమ్డ్ రైల్వే రైలులో ఈ సంఘటన జరిగింది. ఈ రైలులో ప్రయాణికులంతా గుమిగూడి పూజాకార్యక్రమాలు భక్తి గీతాలు పాడుతూ, ఆచారాలలో నిర్వహించారు. భారత్ గౌరవ్ రైళ్లు సాధారణంగా భారతదేశం అంతటా తీర్థయాత్రలకు ఉద్దేశించినవే అయినప్పటికీ కానీ ఈ వీడియో బహిరంగ ప్రదేశాలలో మతపరమైన ఆచారాలపై చర్చను రేకెత్తించింది.
సోషల్ మీడియా స్పందన
ఈ వీడియో ఇంటర్నెట్‌లో భారీ వ్యూస్‌ను సంపాదంచుకుంది. కొంతమంది వినియోగదారులు ప్రజా రవాణాలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడంపై ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు రైల్వే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలామంది ఈ చర్యను సమర్థించారు. ఇది భారతదేశపు లోతుగా పాతుకుపోయిన ఆధ్యాత్మికతలో భాగమని పేర్కొన్నారు.





