News

ఐఎన్ఎస్ “తారాగిరి” నౌకజల ప్రవేశం

40views

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నేవల్డాక్ యార్డ్ వేదికగా ఐఎన్ఎస్ “తారాగిరి” నౌకజల ప్రవేశం కార్యక్రమంలో పాల్గొని జాతికి అంకితం చేశారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. నముద్ర భద్రతకు కేంద్రప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో నౌక దళాన్ని బలోపేతం చేస్తున్నామనన్నారు. విశాఖపట్నం దేశ సముద్ర భద్రతకు చిహ్నంగా నిలుస్తోందని తెలిపారు. సముద్రం ఒకప్పుడు వ్యాపార, సాంస్కృతిక మార్గాలకు కేంద్రంగా ఉండేదని, ఇప్పుడు దేశ సామర్ధ్యాలను తెలుపుతోంది మంత్రి పేర్కొన్నారు. ఐఎన్ఎస్ తారాగిరి జలప్రవేశం పెరుగుతున్న నౌకాదళ సామర్థ్యాన్ని తెలియజేస్తోందని అన్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనంగా తారాగిరి నిలుస్తోందని తెలిపారు. ఉద్రిక్త పరిస్థితి తలెత్తినప్పుడల్లా, భారత నౌకాదళం వాణిజ్య చమురు ట్యాంకర్లకు భద్రతను కల్పించిందని నౌకాదళం భారతదేశ ప్రయోజనాలను కాపాడటమే కాకుండా, అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా తన పౌరులను, వాణిజ్య మార్గాలను రక్షించడానికి అవసరమైన ప్రతి చర్యలను కూడా తీసుకోగలదని నిరూపించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహన్, అడ్మిరల్ దినేష్ కె. త్రిపాటి, వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాలతో పాటు ఇతర నౌక దళా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.