News

రామతీర్ధం పుణ్యక్షేత్రానికి గిరి ప్రదక్షిణ రహదారి ప్రారంభం

110views

రాష్ట్రంలోని ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలోని రామతీర్ధం పుణ్యక్షేత్రానికి 3.40 కోట్ల రూపాయలతో 3.70 కిలో మీటర్ల మేర నిర్మించిన గిరి ప్రదక్షిణ రహదారి ప్రారంభ కార్యక్రమాన్ని అమరావతి నుంచి దృశ్యమాధ్యమం విధానంలో ఉప ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా రామతీర్థం గిరి ప్రదక్షిణ రహదారి నిలుస్తుందని చెప్పారు. గిరి ప్రదక్షిణ మార్గం ద్వారా రామతీర్ధం పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుందని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు.