
177views
రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో నెల్లూరు పురవీధుల్లో ఘోష్ సహితంగా పథ సంచలన్ నిర్వహించారు. ఇందులో శిక్షణ పొందిన 160 మంది మహిళలు, యువతులతో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జూవాలాజీ H.O. Dr. శ్రీరంజని గారు, రాష్ట్ర సేవికా సమితి ప్రాంత కార్యవాహిక( స్టేట్ సెక్రటరీ ) ముఖ్య వక్తగా పాల్గొనగా శ్రీమతి వెంకట భాను గారు జోనల్ సెక్రటరీ శ్రీమతి విజయ, కృష్ణ వేణి, ఝాన్సీ, నిర్మల గార్లు ఉపస్థితి అయ్యారు. పురజనులు అధిక సంఖ్యలో పాల్గొని, పుష్పాలతో సంచలన్ కి స్వాగతం పలికారు.

రాష్ట్ర సేవికా సమితి ప్రపంచంలోని అతి పెద్ద మహిళా సంస్థ ల్లో ఒకటి.మహిళల్లో దేశభక్తి తో కూడిన విలువలు పెంచుతూ వ్యక్తి నిర్మాణం చేసే సంస్థప్రపంచంలోనే అతి పెద్ద యువశక్తిని కలిగిన భారతదేశ సంస్కృతిని కాపాడటానికి యువతులకు రాష్ట్ర సేవికా సమితి ప్రశిక్షణను ఇస్తోంది.





