ArticlesNews

అల్లూరి జిల్లాలో అరుదైన వృక్షాలు

71views

రాష్ట్రంలోని తూర్పు కనుమల్లో పలు చోట్ల ఔషధ గుణాలున్న అరుదైన మేషువా ఫెరే చెట్లు విస్తరించి ఉన్నాయి. ఈ చెట్లను గిరిజనులు ఉప్ప, బంగారం చెట్లుగా పిలుస్తారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం బంగారం గరువు అనే చిన్న గ్రామంలో సుమారు 16 ఎకరాల్లో 1,500 చెట్లున్నా యి. ఈ చెట్ల వల్లే అక్కడ ఉన్న బంగారం గరువు అని పేరొచ్చింది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 1,050 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ వృక్ష జాతి వైద్య, వాణిజ్యపరంగా చాలా విలువైనది. ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య ఇవి చిగురిస్తాయి. ఆసక్తికర విషయమేంటంటే ఈ చెట్లు చిగురించేప్పుడు వాటి ఆకులు వివిధ రంగుల్లో ఆకర్షణనిస్తుంది.

ఈ చెట్లను రక్షించే అవసరం ఉంది. అత్యంత ఔషధ గుణాలున్న ఆ చెట్ల పువ్వులను, గింజలను వివిధ అవసరాలకు సేకరించడం వల్ల కొత్త మొక్కలు పుట్టడం లేదు. ఇది ఆ వృక్ష జాతి మనుగడ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాటి సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ సమరెడ్డి శ్రావణ్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్, బాబా ఇన్ డిగ్రీ ఆఫ్ టెక్నాలజీ, విశాఖపట్నం

ఉప్ప పూలు, ఉప్పగింజలు ఆకర్షణీయంగా కనిపిస్తుందని,ఈ ఆకులు మొదట లేత ఎరుపు రంగు, తర్వాత గోధుమ రంగు, ఆ తర్వాత లేత ఆకుపచ్చ రంగు, చివరిగా పూర్తి ఆకుపచ్చ రంగులోకి మారతాయి. వీటి పువ్వులు తెలుపు రంగులో పెద్దవిగా ఉంటాయి.వీటిని గిరిజన స్త్రీలు అలంకరణ కోసం వినియోగిస్తారు. మంచి సువాసన ఉండటంతో వాణిజ్యపరంగా సుగంధ ద్రవ్యాల తయారీలో వినియోగిస్తున్నారు.పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి కృషికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలని స్థానికులు తెలిపారు.

ఈ చెట్లను గిరిజనులు నరకరు, ఈ పువ్వులు ఫలాదికరణం చెంది పూర్తి ఫలాలుగా మారెందుకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. ఒక్కో ఫలం ఒకటి నుంచి నాలుగు గింజలు అవుతాయి.ఇవి నూనె స్వభావం కలిగి ఉండటం వల్ల కాల్చినప్పుడు కొద్ది సమయం పాటు వెలుగుతాయి. గతంలో గిరిజనులు ఈ గింజలను వెలుగు కోసం వినియోగించేవారు. వీటి నుంచి తీసిన నూనెను తలకు రాసుకోవడానికి, దీపాలు వెలిగించేందుకు చర్మ వ్యాధులు నివారణకు వినియోగిస్తారు.

ఈ చెట్లు ఉన్న స్థలంలో పూర్వం నుంచి ఒక ఆలయం ఉంది. ఆలయంలో ఉన్న దేవత గంగమ్మగా గిరిజనులు కొలుస్తారు. జాతర నిర్వహిస్తారు. అటవీ శాఖ రిజర్వు ఫారెస్ట్ గా ప్రకటించింది.

ఈ వృక్షాలను నరికేందుకు ఆదివాసీలు ఇష్టపడరు. అయితే ఏటా గిరిజనులు చెట్ల పువ్వులను గింజలను వివిధ అవసరాలకు సేకరించడం వల్ల కొత్త మొక్కలు పుట్టటం లేదు. ఇది ఆ వృక్ష ,జాతి మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

పర్యాటక శాఖ మరియు అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుకుంటున్నారు.