News

మోనాలిసాతో ఫర్మాఖాన్ వివాహం లవ్ జిహాదే..

114views

కుంభమేళాలో అందరికీ పరిచయమైన పూసల వ్యాపారి మోనాలిసాకి ఫర్మాన్ ఖాన్‌తో వివాహమైన విషయం తెలిసిందే. అయితే….దీనిని లవ్ జిహాద్ అని మొదట్లోనే హిందుత్వవాదులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు న్యాయవాది నజియా ఇలాహి ఖాన్ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి వివాహం సాధారణమైంది కాదని, ఇది పక్కా లవ్ జిహాద్ అని తేల్చి చెప్పారు. అలాగే హిందూ వివాహ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తోందని కూడా పేర్కొన్నారు.

హిందూ వివాహ సంప్రదాయాలను కూడా తుంగలో తొక్కారని పేర్కొన్నారు. ఇప్పటికీ ఫర్మాన్ తనను తాను ముస్లింలాగే చెప్పుకున్నాడని పేర్కొన్నారు. హిందూ మతాన్ని కించపరచడం, దుర్వినియోగం చేయడం అనేది పెద్ద నేరమన్నారు. ఫర్మాన్ ఇప్పటికీ తాను ముస్లింనేనని చెప్పుకున్నాడని, అలాంటప్పుడు హిందూ సంప్రదాయాల ప్రకారం గుడిలో ఎలా పెళ్లి జరిగిందని ప్రశ్నించారు. హిందూ వివాహ చట్టం కింద వివాహం చెల్లుబాటు కావాలంటే ఇద్దరూ హిందువులై ఉండాలి, అందువల్ల ఈ బంధం చట్టపరంగా సందేహాస్పదంగా ఉంది అని వివరించారు.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు ఉన్న బలమైన నెట్‌వర్క్ కారణంగా కేరళ ఇటువంటి కార్యకలాపాలకు అనుకూలమైన వేదికగా మారిందని ఆమె ఆరోపించారు. తనకు అందిన సమాచారం ప్రకారం, మోనాలిసాకు వేగంగా జారీ చేసిన పాస్‌పోర్ట్ ఆమెను సిరియాకు పంపే పెద్ద ప్రణాళికలో భాగం కావచ్చని నజియా అన్నారు. ఈ విషయంపై జాతీయ భద్రతా సంస్థలు తక్షణమే చర్యలు తీసుకుని, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.