ArticlesNews

దానాలకు శ్రేష్ఠం మీన సంక్రాంతి

84views

( మార్చి 15 – మీన సంక్రమణం )

సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించిన రోజును మీన సంక్రాంతి లేదా మీన సంక్రమణం అంటారు. గత జన్మ పాపాల నుంచి విముక్తి పొందడానికి ఈ రోజున జపాలు, పూజలు చేస్తారు. పుణ్య నదుల్లో పవిత్ర స్నానాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. స్నానానంతరం రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో ఎర్రని కుసుమాలు వేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి అర్ఘ్యం సమర్పించాలి. సూర్య నమస్కారాలు చేసి, ఆదిత్య హృదయం భక్తిగా పఠించాలి. . అనంతరం కులగురువులను పూజించాలి.

మీన సంక్రాంతి రోజున సూర్యభగవానుణ్ణి, ఫాల్గుణ మాసానికి అధిపతి అయిన లక్ష్మీనృసింహస్వామిని, మీనరాశికి అధిపతి అయిన గురువును పూజిస్తారు. కుటుంబ సుఖసౌఖ్యాల కోసం ప్రార్థించమని, ఇతరులకు శ్రేయస్సు కలిగించే పనులు చేయమని పండితులు సూచించారు. ఈ రోజున పూజామందిరంలో లక్ష్మీనృసింహస్వామి, సూర్య భగవానుడి చిత్రపటాలు ఏర్పాటు చేసుకోవాలి. కుసుమాలతో అలంకరించాలి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి.. పాయసం, పండ్లు నివేదించాలి. శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. భూదానం మరింత శ్రేష్ఠమని చెబుతారు.