News

ఉత్తరాఖండ్ లో దేవాలయాల్లో అన్యమతస్థుల ప్రవేశంపై నిషేధం

96views
2026 చార్ ధామ్ యాత్ర ప్రారంభానికి ముందే ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరియు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించాయి.
బద్రీనాథ్, కేదార్‌నాథ్ సహా కమిటీ పరిధిలోని 47 ప్రముఖ దేవాలయాల్లోకి ఇకపై హిందువులకు (సనాతన ధర్మ అనుచరులకు) మాత్రమే ప్రవేశం ఉంటుంది. అన్యమతస్థుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు.
దేవాలయాల పవిత్రతను కాపాడటానికి, ఈ క్షేత్రాలు పర్యాటక కేంద్రాలు కాదని, ఆధ్యాత్మిక కేంద్రాలని చాటి చెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు BKTC అధ్యక్షుడు హేమంత్ ద్వివేది తెలిపారు.
ఏప్రిల్ 19 నుండి ప్రారంభం కానున్న చార్ ధామ్ యాత్ర నుండే ఈ నిబంధన అమల్లోకి రానుంది. భక్తులు తప్పనిసరిగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ,ఆలయాల్లో మొబైల్ ఫోన్లు వాడకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.