News

నిత్యాన్నదానం ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి జేఈవో

216views

వైఎస్సార్‌ కడప  జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిత్యాన్నదానం ఏర్పాట్లను తితిదే జేఈవో వల్లూరు వీరబ్రహ్మం శుక్రవారం పరిశీలించారు. సివిల్, విద్యుత్తు విభాగం సాంకేతిక నిపుణులు, అన్నదానం, అటవీ, ఉద్యాన విభాగం అధికారులతో చర్చించారు. భక్తులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జేఈవో ఆదేశించారు. వచ్చే వారంలో నిత్యాన్నదానం కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. రామయ్య దర్శనానికి తరలివచ్చే భక్తులకు భోజనం వసతి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తిరుమల తరహాలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తామని చెప్పారు. అనంతరం శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎస్ఈలు మనోహరం, వెంకటేశ్వర్లు, అన్నదానం ప్రత్యేక అధికారి శాస్త్రి, డిప్యూటీ ఈవోలు శివ ప్రసాద్, సెల్వం, ఈఈలు సుమతి, రవిశంకర్ రెడ్డి, డీఈ నాగరాజు, ఎఫ్ఆర్వో విజయ్ కుమార్, ఉద్యాన అధికారి శ్రీనివాసులు, ఏఈ అమరనాథ్ రెడ్డి పాల్గొన్నారు.