News

ఇస్రో ‘యువ విజ్ఞాని కార్యక్రమ్‌’

130views

విద్యార్థుల్లోని సృజనాత్మకత, మేథస్సును వెలికితీసి ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అవకాశం కల్పిస్తోంది. ‘యువ విజ్ఞాని కార్యక్రమ్‌’(యువిక-2026) పేరుతో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనుంది. ఇందుకుగాను దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 2026 జనవరి 1 నాటికి తొమ్మిదో తరగతి చదువుతున్న భారతీయ విద్యార్థులు మాత్రమే అర్హులు.

ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు
jigyasa.iirs.gov.in/yuvika పోర్టల్‌., www.isro.gov.in నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది.

ముందుగా జిగ్యాస వెబ్‌సైట్‌లోకి వెళ్లి విద్యార్థి పేరు, ఈ-మెయిల్‌ ఐడీతో రిజిస్టర్‌ చేసుకోవాలి.

  • ఈ-మెయిల్‌కు వచ్చే లింక్‌పై క్లిక్‌ చేసి పరిశీలించుకోవాలి.
  • లాగిన్‌ అయిన తర్వాత, విద్యార్థులు ఆన్‌లైన్‌ క్విజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.
  • ఇది ఒక్కసారి మాత్రమే రాసే అవకాశం ఉంటుంది. అందులో వచ్చిన మార్కులకు ఎంపికలో 10 శాతం వెయిటేజీ ఇస్తారు.
  • క్విజ్‌ పూర్తయ్యాక, వ్యక్తిగత వివరాలు, చదువుకు సంబంధించిన వివరాలను దరఖాస్తులో నింపాలి.
  • అర్హతను నిర్ధారించే పత్రాలను స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి.
  • వెయిటేజీ కల్పిస్తారు

  • గ్రామీణ ప్రాంతంలో చదువుతున్నట్లయితే 15 శాతం అదనపు వెయిటేజీ లభిస్తుంది.
  • ఎనిమిదో తరగతిలో పొందిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఉంటుంది.
  • గత మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్‌ ప్రతిభ పరీక్షలు, ఒలింపియాడ్‌లో పాల్గొని మొదటి, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వారికి 10 శాతం వరకు వెయిటేజీ ఇస్తారు.
  • రిజిస్టర్డ్‌ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటినవారు, స్కౌట్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లలో సభ్యులుగా ఉన్నవారికి 5 శాతం వరకు వెయిటేజీ ఇస్తారు.
  • ఎంపికైన విద్యార్థులకు అయ్యే ఖర్చు మొత్తం ఇస్రోనే భరిస్తుంది.
  • రిజిస్ట్రేషన్లు ప్రారంభం: ఫిబ్రవరి 27
    నమోదుకు చివరి తేదీ: మార్చి 31
    రెండో జాబితా (ఖాళీల ఆధారంగా): ఏప్రిల్‌ 20
    మొదటి  ఎంపిక జాబితా విడుదల: ఏప్రిల్‌ 13
    శిక్షణ (యువిక): మే 11 నుంచి  22 వరకు