
ఆరు దశాబ్దాల పైగా నంద్యాల జిల్లా స్వయం సేవకుల ఆకాంక్షల సాకారంగా జిల్లా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది.
తదుపరి విభాగ్ సంఘ్ చాలక్ శ్రీ నీలకంఠేశ్వరయ్య గారి అధ్యక్షతన సమావేశమైన సభలో విద్యా భారతి క్షేత్ర కార్యకారిణి సదస్యులు డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాణ సంస్థ పీ వీ గ్రూప్ వ్యవస్థాపకులు, ప్రస్తుత మన కార్యాలయ నిర్మాత శ్రీ పబ్బతి వేణు గోపాల్, ప్రధాన వక్త ప్రాంత ప్రచారక్ శ్రీ విజయ ఆదిత్య జీ, జిల్లా సంఘ్ చాలక్ శ్రీ చిలుకూరి శ్రీనివాస్ వేదిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణంలో విశేషంగా కృషి చేసిన వారిని సత్కరించారు.

అనంతరం వక్తలు మాట్లాడుతూ, మాధవ నిలయం, వివేకానంద సేవా సమితి సంయుక్త కార్యాలయాలు ఎంతో బాధ్యతాయుతంగా తమ సమాజ సేవా కార్యక్రమాలలో పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు.కార్యాలయం సమాజానికి ప్రేరణ దాయకంగా, కార్యాలయ సందర్శకులకు స్ఫూర్తినివ్వాలని తెలిపారు
జిల్లాలోని అన్ని గ్రామాల్లోని సంఘ్ శాఖల, స్వయం సేవకుల పూర్తి సమాచారం కలిగిన సమాచారం కేంద్రంగా, నూతన సాంకేతికతను అంది పుచ్చుకుని, సదరు సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి, సమయాను కూలంగా వినియోగించుకుని సంఘకార్య సార్వ జనీనతకు కృషిచేయాలని ఆకాంక్షించారు.

కార్యాలయం ” సంపర్క సూత్రం”
కార్యాలయం సందర్శించిన వారికి స్ఫూర్తి నివ్వడమే కాకుండా, వారి సమాచారాన్ని ప్రచారకులకు, ప్రచారకుల సమాచారాన్ని అందుబాటును వారికి అందించి సంపర్క సూత్రంగా వెలుగొందాలని సమాజంలో ఏ ఆదర్శ మార్పులనైతే ఆశిస్తున్నామో, ఆ ఆదర్శాలన్నీ ఉత్కృష్ట స్థాయిలో కార్యాలయంలో ఆచరింపబడాలని పేర్కొన్నారు.

సమాజం ఆస్తులు ఎన్ని కల్పించినా సంఘ్ యొక్క ఏకైక ఆస్తి సంఘ్ శాఖ , అందులో సాన పెట్టబడిన స్వయం సేవకులు మాత్రమేనని తెలిపారు. సంఘ్ వ్యక్తి నిర్మాణం చేస్తూ దేశ నిర్మాణానికి దోహదం చేస్తుందని, సంఘ్ శాఖలో తయారైన స్వయం సేవకులు మాత్రమే సమాజోద్దరణ పనులు స్వచ్చందంగా చేపడతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్త జ్యేష్ట స్వయం సేవకులు, సంఘ్ శ్రేయోభిలాషులు, స్వయం సేవకులు, తదితర పెద్దలు విస్తృతంగా పాల్గొని కార్యక్రమాన్ని ఆద్యంతం ఆస్వాదించారు.





