News

కేరళ స్టొరీ నిజమైన కథే బాధితురాలి వీడియో వైరల్

99views

కేర‌ళ స్టోరీ 2 సినిమా విడుద‌ల వివాదాస్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే. . ప్ర‌స్తుతం సినిమా విడుద‌ల వివాదంపై కోర్టులో కేసు న‌డుస్తోంది. అయితే తాజాగా తాను నిజ‌మైన‌ బాధితురాలిని అంటూ ఓ మ‌హిళ కామెంట్లు చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మ‌హిళ వీడియోలో మాట్లాడుతూ.. నా పేరు అన‌గ‌.. నేను కేర‌ళ‌లోని త్రిషూర్ ప్రాంతానికి చెందిన మ‌హిళ‌ను. నేను ఫిజియోథెరపిస్ట్ గా ప‌నిచేస్తున్నాను. కేర‌ళ‌స్టోరీ సినిమాలో శాలిని ఉన్ని క్రిష్ణ‌న్ ను మ‌త మార్పిడి చేసిన‌ట్టు న‌న్ను కూడా మ‌తం మార్చారు. హిందూ కుటుంబంలో పుట్టిన నేను పై చ‌దువుల కోసం ఎర్నాకులం వెళ్లిన‌ప్పుడు హాస్ట‌ల్ లో ఉన్న స‌మ‌యంలో మ‌త‌మార్పిడి చేసే ప్ర‌య‌త్నం జ‌రిగింది. అచ్చం సినిమాలో చూపించిన‌ట్టుగానే మా రూమ్ మేట్స్ న‌న్ను మతం మార్చారు.

ముందుగా వాళ్లు న‌న్ను మ‌తం మార్చ‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ముందుగా వాళ్లు మ‌తం గురించి ప్ర‌శ్న‌లు అడిగి క‌న్ఫ్యూజ్ చేసి త‌ర‌వాత మ‌తం మారుస్తారు. అలా వాళ్ల మాయ‌లో ప‌డ్డ త‌ర‌వాత మన మ‌తాన్ని మ‌న‌మే తిట్టుకుంటాం, కించ‌ప‌రుస్తాం. మ‌నం ఆస‌క్తిచూపించిన వెంట‌నే వాళ్ల మ‌త గ్రంథాలు ఇచ్చి చ‌ద‌వ‌మంటారు. ద‌య‌చేసి అలా ఎవ‌రూ ట్రాప్ లో ప‌డ‌కండి. నేను దేవుడి ద‌య‌వ‌ల్ల ఆ ట్రాప్ లో నుండి బ‌య‌ట‌ప‌డ్డాను.. అంటూ మ‌హిళ వ్యాఖ్యానించింది.