
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మహా కుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ తెలిపారు. కుంభాభిషేకం మహోత్సవం ఏర్పాట్లపై విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీ శా, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శీనా నాయక్ మాట్లాడుతూ.. వచ్చే నెల 6,7,8 తేదీల్లో కుంభాభిషేకం వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభాభిషేకం వైభవంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మార్చి 6 ఉదయం 8 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి వారసుడు విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా మహా కుంభాభిషేకం ఘనంగా ప్రారంభమవుతుందని చెప్పారు. ఆలయ విమాన గోపురాల సంప్రోక్షణ వేద పండితుల ఆధ్వర్యంలో వైదిక క్రతువులు నిర్వహిస్తామని తెలిపారు





