
ఆధునిక కాలంలో మానవు ని ఆరోగ్యానికి దిక్సూచి యోగాసనాలని శ్రీకృష్ణాశ్రమ దక్షిణామూర్తి పీఠం పీఠాధీశులు స్వామి సదానంద మహారాజ్ పేర్కొన్నారు. ఆయన జాతీయ సంస్కృత వర్సిటీలో జరిగిన అఖిల భారత సంస్కృత వర్సిటీల ప్రాయోగిక యోగా పోటీల సంగమం–2026 ప్రారంభోత్సవానికి విచ్చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయిలో యోగాసన పోటీలు నిర్వహించడం యోగశాస్త్ర జ్ఞాన బోధనకు చక్కటి ప్రచార వేదిక అన్నారు. యోగ శాస్త్రం ద్వారా మానవుడు ఇంద్రియ నిగ్రహాన్ని పొంది స్వస్థమైన శరీరాన్ని పొందుతారని చెప్పారు. అనంతరం వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థుల్లో యోగా శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచి ప్రతిభను వెలికితీసేందుకు జాతీయ స్థాయి యోగా పోటీలు నిర్వహించినట్లు వివరించారు. ఈ పోటీల్లో 14 సంస్కృత వర్సిటీల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొంటున్నారని తెలిపారు.





