News

శివాజీ స్ఫూర్తి కేంద్రంలో అన్న ప్రసాద వితరణ

199views

శ్రీశైల క్షేత్రంలోని  శివాజీ స్ఫూర్తి కేంద్రంలో  మహా శివరాత్రిని  పురస్కరించుకొని ఈ  నెల 13,14 తేదీలలో  ‘అన్న ప్రసాద వితరణ’ కార్యక్రమాన్ని  నిర్వహించారు. మహా శివరాత్రి రద్దీ దృష్ట్యా   ఛత్రపతి శివాజీ మహారాజ్ దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తుల కోసం అన్నప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. అన్ని దానాలలో కెల్ల అన్నదానం మిన్న అని, ఆ ఈశ్వరుని కృప వల్లే ఇతరుల ఆకలి తీర్చే మహాసేవ చేసే భాగ్యం దక్కిందని  తెలిపారు.

 
అలాగే  మెడికల్ క్యాంపును  నిర్వహించారు.  ఇందులో భాగంగా  చికిత్స అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, ఔషదాలు    ఉచితంగా వితరణ చేశారు.