News

విశాఖ తీరంలో నౌకా విన్యాసాలు

121views

విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ – ఐఎఫ్‌ఆర్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు పాల్గొన్నారు. ఈ 71 యుద్ధ నౌకలు పరేడ్‌ నిర్వహించాయి. నౌకాదళ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్‌ఎస్‌ సుమేధ నౌకపై రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు. రష్యా, ఆస్ట్రేలియా, యూఏఈ.. తదితర దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్‌గార్డ్, మర్చంట్‌ నేవీ, పరిశోధన నౌకలు 7 ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొన్నాయి.

యుద్ధ నౌకల పెరేడ్ ను వీక్షించిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ… సముద్ర సాంప్రదాయాలు, , దేశాల ఐక్యత, పరస్పర సహకారాన్ని ఫ్లీట్ రివ్యూ ప్రతిబింబిస్తుందని ఉద్ఘాటించారు. భారత్ అనేక ఏళ్ళుగా వాణిజ్యాన్ని, సాంస్కృతిక మార్పిడిని సముద్ర మార్గాల ద్వారా నిర్వహించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు.