News

శిలా శాసనాల డిజిటలైజేషన్‌కు శ్రీకారం

185views

భారతీయ చారిత్రక వారసత్వాన్ని భద్రపరిచే దిశగా భారత్‌శ్రీ ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో చైన్నె పురావస్తు, పురాతత్వ శాఖ శాసన విభాగ బృందం శిలాశాసనాల డిజిటలైజేషన్‌ కార్యక్రమానికి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో    శ్రీకారం చుట్టారు. ఈ దేవస్థానంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా చైన్నె, ఎపిగ్రాఫీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎంఏసుబాబు బృందం శ్రీకృష్ణదేవరాయల హయాం నుంచి 18వ శతాబ్దం వరకు శిలాశాసనాలను సాంకేతికత విధానంతో పరిశీలన జరిపి అధ్యయనం చేశారు. ఏసుబాబు మాట్లాడుతూ శిలాశాసనాల లిపి ఆధారంగా స్థానిక భాషల్లో అనువదింపజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మంగళగిరి పరిధిలోని చారిత్రక ఆధారాలు, శిలాశాసనాలను అధ్యయనం చేసి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన అధికారులకు నివేదిక అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్‌, ప్రీలాన్స్‌ ఆర్కియాలజిస్ట్‌ రామగంగాధర్‌ పాల్గొన్నారు.