News

సోష‌ల్ మీడియా పరాకాష్ట.. శివుడికి ప్రసాదంగా గంజాయి అంటూ రీల్స్ చేసిన యువకులు

153views

శంషాబాద్‌లోని ధర్మగిరి ఆలయ ప్రాంగణంలో గంజాయి కలకలం సృష్టించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొందరు యువకులు శివుడికి గంజాయిని ప్రసాదంగా సమర్పించి అపచారానికి పాల్పడ్డారు. గంజాయిని దేవుడి ముందు ఉంచి పూజలు చేస్తున్నట్లు వీడియో తీయడమే కాకుండా, దానికి సంగీతాన్ని జోడించి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌గా పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన యువకులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు చేశారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరపగా, ఈ ఘాతుకానికి పాల్పడిన యువకులు బడంగ్‌పేటకు చెందిన వారిగా గుర్తించారు. ఇక సోషల్ మీడియాలో లైకుల కోసం ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తూ, నిషేధిత పదార్థాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టపరంగా కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని సీపీ ఈ సందర్భంగా హెచ్చరించారు.