News

నంద్యాలలో అయోధ్య రామ మందిరాన్ని ఆవిష్కరించిన ఎగ్జిబిషన్

314views

నంద్యాల జిల్లా, స్థానిక ప్రథమ నంది దేవస్థానం ఎగ్జిబిషన్ ఆవరణలో సనాతనుల ఆరాధ్య దైవం శ్రీరాముడి భవ్య దివ్య అయోధ్య మందిర నమూనాను, ఎంతో సహజంగా రూపుదిద్ది చూపరులను ఆకట్టుకున్న ఎగ్జిబిషన్ శ్రీను కృషిని, నైపుణ్యాన్ని, రామచంద్రుడి పట్ల ఆయన భక్తిని అభినందిస్తూ ఎగ్జిబిషన్ “శ్రీను”ను ఘనంగా సన్మానించడం జరిగింది.

సీనియర్ ఫోటోగ్రాఫర్ చింతలపల్లి వాసు ఆధ్వర్యంలో నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు టిడిపి సీనియర్ నాయకులు జిల్లెల్ల శ్రీరాములు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎగ్జిబిషన్ లో అయోధ్య రామాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, శ్రీను గారు ఎంతో సృజనాత్మకంగా ఆలయ నమూనాను ఏర్పాటు చేశారని, బాల రాముని ప్రతిమ ఈ ప్రాంత వాసులను ఎంతో అలరించిందని పేర్కొన్నారు. చింతలపల్లి వాసు మాట్లాడుతూ రామాలయ నమూనా రాముని విగ్రహం ఏర్పాటుతో ఎగ్జిబిషన్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరి సిందన్నారు. వందలాది మంది సందర్శకులు, చిన్నారులు ఆలయ నమూనాను ఆసక్తిగా తిలకించారని పేర్కొన్నారు. డాక్టర్ గెలివి సహదేవుడు బాల రాముని వైభవాన్ని, ఆలయ విశిష్టతలను వివరించారు.