ArticlesNews

దాడులే వామపక్షాల సాంప్రదాయం

497views

ఫిబ్రవరి 08 వ తేది శనివారం 44 వ కోల్‌కతా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. కోల్‌కతాలోని విద్యా సంస్థల విద్యార్థులమని చెప్పుకునే వామపక్ష గూండాలు కొందరు బిజెపి ‘జనబార్తా’, వీహెచ్‌పీ స్టాల్స్‌పై దాడి చేశారు. దుండగులలో ఒకరు శ్రీమద్ భగవత్గీతను తన కాళ్ళ క్రింద వేసి తొక్కారు కూడా. వాళ్ళు చేసే పనులకు విరుద్ధంగా వామపక్షవాదులు తమది ‘ప్రగతిశీల’ భావజాలం అని చెప్పుకుంటారు. అంతే కాకుండా బిజెపికి అసహనం ఉందని ఆరోపిస్తారు.

ఈ సంవత్సరం జనవరి 29 న ఫెయిర్ ప్రారంభమైనప్పటి నుండి వామపక్ష సమూహాలు తమ CAA వ్యతిరేక ప్రదర్శనల కోసం బుక్ ఫెయిర్ గ్రౌండ్‌ను ఉపయోగించాయి. వామపక్షాల విద్యార్థుల్లో ఒక విభాగం కూడా శనివారం సిఎఎపై ఆందోళన చేస్తున్నారు. బిజెపి నాయకుడు రాహుల్ సిన్హా స్టాల్‌లోకి ప్రవేశించడాన్ని చూసిన వారు పరిస్థితిని మరింత తీవ్రతరం చేయడానికి ప్రయత్నించారు. వారు కొత్త పౌరసత్వ చట్టం మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, కాని సిన్హా వారి కవ్వింపు చర్యలపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. దాంతో విసుగు చెందిన విద్యార్థులు బిజెపి-విహెచ్‌పి స్టాల్స్‌లోకి జొరబడి విధ్వంసం సృష్టించారు. అనేక మంది బిజెపి-విహెచ్‌పి కార్యకర్తలపై దాడి చేశారు. అంతేకాకుండా స్టాల్స్ లోని అనేక పుస్తకాలను ధ్వంసం చేశారు.

డజను మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న యువకులను బీదన్ నగర్ (నార్త్) పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడంతో పరిస్థితులు మరింత  ఉద్రిక్తంగా మారాయి. వారు పోలీసులతో గొడవలు ప్రారంభించారు. చివరికి పోలీసు స్టేషన్ ఆవరణలో, విధుల్లో ఉన్న ఒక పోలీసు మహిళను కనికరం లేకుండా కొట్టడం కూడా జరిగింది. పోలీసుల నుండి ఎలాంటి బలప్రయోగము, ప్రతిఘటన లేకపోయినా ఈ సంఘటన కూడా జరిగడం విశేషం. పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన యొక్క వీడియో ఫుటేజ్ లో కొంతమంది మహిళలు పోలీసు అధికారిని కొట్టడం, పురుష వామపక్ష కార్యకర్తలు ఒక  మహిళా కానిస్టేబుల్ ను తన్నడం, జుట్టు పట్టుకుని లాగడం కనిపించింది.

బుక్ ఫెయిర్‌లో జరిగిన ఈ సంఘటన వారి అభిప్రాయం కాకుండా వేరే ఏ అభిప్రాయాన్నైనా అంగీకరించని వామపక్షాల యొక్క వాస్తవిక వైఖరిని బహిర్గతం చేస్తుంది. వామపక్షవాదులు వారిని సవాలు చేసే ఒక భావజాలాన్ని ఎదుర్కోవడానికి వారు పన్నే పన్నాగాలను, ఆడే నాటకాలను కూడా ఇది బహిర్గతం చేసింది. వారు దీనిని జెఎన్‌యులో చేశారు. 2019 సెప్టెంబర్‌లో జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో కూడా వారు ఇదే పని చేశారు.

తమను తాము ‘నక్సల్స్’ అని బహిరంగంగా పేర్కొన్న విశ్వవిద్యాలయ విద్యార్థుల బృందం ఆందోళన నిర్వహించి, నినాదాలు చేశారు. నల్ల జెండాలను పట్టుకుని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి బాబుల్ సుప్రియోను చుట్టూ ముట్టారు. నిజానికి ముందస్తుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేసిన సెమినార్ కోసం బాబుల్ క్యాంపస్‌ కి వచ్చారు.  దీని కోసం నిర్వాహకులు విశ్వవిద్యాలయ అధికారుల నుండి అనుమతి కూడా పొందారు. కానీ వారికున్న అసహనం వల్లనే బాబుల్‌ను జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు వేధించారు. వామపక్షవాదులు తమ రాజకీయ ఎజెండాకు విరుద్ధమైన ప్రతిదానిపై దాడి చేసే తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

నిజానికి మతపరమైన పద్ధతులు మరియు చట్టంపైన తమకున్న శత్రుత్వం, వ్యతిరేకత కారణంగానే వామపక్షాలు అపఖ్యాతి పాలయ్యాయి. ఏప్రిల్ 30, 1982 న, ఆనంద మార్గ్ కి చెందిన పదహారు మంది సన్యాసులు మరియు ఒక సన్యాసినిని కోల్‌కతాలోని బీజాన్ సేతు (బల్లిగంజ్ వంతెన) వద్ద పగటిపూట చంపి, దహనం చేశారు. అప్పటి మార్క్సిస్టు ప్రభుత్వం నిందితులు ఒక్కర్ని కూడా అరెస్టు చేయలేదు. అలాగే అనేక సందర్భాల్లో, వామపక్ష సంఘాలు భారత్ సేవాశ్రమ సంఘం మరియు రామకృష్ణ మిషన్ల పై కూడా దాడి చేశాయి.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ 2020 జనవరి 12 న స్వామీజీ పుట్టినరోజు సందర్భంగా సేవలకు హాజరు కావడానికి బేలూర్ కాంప్లెక్స్‌లో రాత్రిపూట బస చేసినప్పుడు కూడా కమ్యూనిస్టులు రామకృష్ణ మిషన్‌కు వ్యతిరేకంగా చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన బుక్ ఫెయిర్లో శ్రీమద్ భగవద్గీతను వామపక్ష కార్యకర్త తొక్కిన సంఘటనలో పెద్దగా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. ఇది వారి అరాచక స్వభావానికి మరో ఉదాహరణ మాత్రమే. ఎందుకంటే భారతీయ మత మరియు ఆధ్యాత్మిక వ్యవస్థలను ధ్వంసం చేయడం మరియు అగౌరవపరిచడంలో వామపక్షీయులకి సుదీర్ఘ చరిత్ర ఉంది.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.