
నంద్యాల, సంఘమిత్ర ఆవాసం లో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. సంఘమిత్ర అధ్యక్షులు చిలుకూరి శ్రీనివాస్ అధ్యక్షతన ప్రారంభమైన సభలో ముఖ్య అతిథులుగా స్థానిక ప్రముఖ గాస్ట్రో సర్జన్ డాక్టర్ లీలా ప్రసాద్, వ్యవసాయదారులు శ్రీ మేరువ సోమ శేఖర్ రెడ్డి, ప్రధాన వక్త గా సేవా భారతి ప్రాంత కార్యదర్శి శ్రీ మనోహర్, సంఘమిత్ర కార్యదర్శి శ్రీ నాగ సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ మహేశ్వర రెడ్డి, కోశాధికారి శ్రీ నాగ రాజయ్య, సంఘటనా కార్యదర్శి శ్రీమతి జయశ్రీ, కార్యవర్గ సభ్యులు శ్రీమతి వెంకటేశ్వరి, శ్రీ వివి రమణయ్య గౌడు, శ్రీ రామాంజనేయులు, శ్రీ మల్లిఖార్జున, సంఘమిత్ర సేవా ప్రముఖ్, చిన్నారులు, తదితర కుటుంబ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు.

చిన్నారుల క్రమశిక్షణ, యోగా కౌశలం చూసి శ్రీ శారదా విద్యా పీఠం పూర్వ విద్యార్థి డాక్టర్ లీలా ప్రసాద్ తన విద్యార్థి దశను గుర్తుకు తెచ్చు కుని మురిసి పోయారు.
ప్రధాన వక్త తన సందేశంలో ప్రపంచ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఒడిదుడుకులలో ఐక్యరాజ్య సమితిలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అమెరికా స్వార్థ పూరిత ఒంటెద్దు పోకడలతో విసిగి పోయిన ప్రపంచ దేశాలు, సర్వేజనా సుఖినోభవంతు అంటూ ప్రపంచ శాంతిని కాంక్షించే భారత్ మధ్య వర్తిత్వాన్ని కోరుకుంటున్నాయని తెలిపారు. దేశ పౌరులుగా చక్కటి క్రమశిక్షణతో గొప్ప పౌరులుగా ఎదిగి ఈ దేశం గర్వించే స్థాయికి ప్రతి ఒక్కరూ ఎదగాలని ఆకాంక్షించారు.





