News

హైందవ ధర్మ రక్షణకు కృషి

157views

హైందవ ధర్మ రక్షణకు పనిచేయాలన్న లక్ష్యంతో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను ఏర్పాటు చేసి తాను రాజానగరం, జగ్గంపేట, రంపచోడవరంతో పాటు రాజమహేంద్రవరం, కాకినాడ నియోజవర్గాలలో అనేక మందికి సేవలు అందిస్తున్నానని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, కంబాల శ్రీనివాసరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని స్థానిక మంజీర హోటల్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో కంబాల శ్రీనివాసరావు వెల్లడించారు. బిజేపిలోకి రావడానికి రెండేళ్ళ ముందే తాను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను ఏర్పాటుచేసి ఎస్సీ, ఎస్టీ, బిసి బడుగు, బలహీనవర్గాలకు 18 రకాలైన సేవలను నిర్వహిస్తూ వస్తున్నాన్నారు. ప్రధాని మోదీ స్ఫూర్తితోనే తాను సేవా కార్యక్రమాలునిర్వహిస్తున్నానన్నరు. తాను చేస్తున్న సేవలకు ఐదు నియోజకవర్గాలలోనూ మంచి గుర్తింపు వస్తుందన్నారు.