News

తాళ్లతో ఒక దానిపై మరొకటి కట్టేసి.. ఊపిరాడక మృతి చెందిన గోవు

172views

ఒడిశా ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలనుంచి పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఒడిశా పితాతోలి నుంచి గోవులను మంగళవారం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళను ఢీకొట్టే యత్నం జరిగింది. పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పితాతోలికి చెందిన వసంతి, స్థానికులు కొందరు పురుషోత్తపురం ఎల్‌సీ గేటు వద్ద మూడు వాహనాలను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. రెండు వాహనాలను ఆపేందుకు ప్రయత్నిస్తుండగా అవి అతివేగంగా వసంతిపైకి రావడంతో ఆమె తప్పించుకున్నారు. తరవాత మరో వాహనాన్ని అడ్డుకోగా వాహనదారుడు తాళం తీసుకుని పారిపోయాడు. ఆమె స్థానికుల సాయంతో పశువుల వాహనాన్ని గ్రామీణ పోలీసుస్టేషన్‌కు అప్పగించారు. అందులో 18 పశువులు ఉన్నాయి. వాటిని మెడకు తాళ్లతో గట్టిగా ఒక దానిపై ఒకటి కట్టేయడంతో ఊపిరాడక ఒక పశువు మృతి చెందింది. మిగిలిన పదిహేడూ సొమ్మసిల్లిపోగా వాటిని కిందకు దింపి వైద్యం చేయించారు. అనంతరం వాటిని పోలీసుల అనుమతితో ఒడిశాలోని దిగపొండి గోశాలకు తరలించారు. దీనిపై గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.