News

హిందువులకు ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లు కావాలి : బంగ్లాదేశ్‌ హిందూ సంఘం డిమాండ్‌

140views

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆ దేశంలోని ప్రముఖ హిందూ సంఘం అక్కడి ఈసీతో సమావేశమైంది. ఫిబ్రవరిలో పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్న వేళ.. హిందూ ఓటర్లకు ఎన్నికల సంఘం అదనపు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేసింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో తమకు రక్షణ లేదని.. ముఖ్యంగా మైనార్టీలపై దాడులు జరుగుతోన్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పేర్కొంది. సురక్షితమైన ఓటింగ్‌ కోసం తమకు ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది.

బంగ్లాదేశ్‌ విద్యార్థి నాయకుడు ఉస్మాన్‌ హాదీ హత్యతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు.