
పోలవరం జిల్లా చింతూరులో సామాజిక సమరసత వేదిక,ఎస్సీ,ఎస్టీ,హక్కుల సంక్షేమ వేదికల సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీ కులాల, ఎస్టీ తెగల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళన లక్ష్యాలను శ్యామ ప్రసాద్ వివరిస్తూ, “75 సం,ల్లో అన్ని కులాల ఎస్సీలు, అన్ని తెగల ఎస్టీలు, అందరం సమానంగా అభివృద్ధి చెందలేదన్నారు. ఇందుకోసం
1) 59 ఎస్సీ కులాలం కలసి మెలసి పని చేయాలి,
2) 35 గిరిజన తెగలవారం కలసి మెలసి పని చేయాలి,
3) ఎస్సీలం,ఎస్టీలం కలసి మెలసి పని చేయాలి,
4) మనం అందరం హిందువులం,సోదరులం,
అని అందరం కలసి,మెలసి పనిచేయాలని ఈ దిశలో ఆర్ఎస్ఎస్, సమరసతా సేవా ఫౌండేషన్ పనిచేస్తున్నాయి” అని వివరించారు,
వనవాసులు= గ్రామవాసులు=నగరవాసులు
ఒకప్పుడు ప్రపంచం అంతటా అడవి,అంతటా వనవాసులే! నదుల వద్ద, చెరువులు ఏర్పాటు చేసుకుని గ్రామాలు ఏర్పడ్డాయి. మరి కొంతకాలమునకు నగరాలు ఏర్పడ్డాయి. భారత దేశంలో వనవాసులు, గ్రామవాసులు, నగరవాసుల మధ్య సత్సంబంధాలు కొనసాగాయన్నారు.
ఉదా: నిషాద రాజు గుహుని రాజ్యం అయోధ్యకు ఎంతో దూరంలో లేదు,అయినా గుహుడు ఎప్పుడూ స్వతంత్ర రాజే! ఈ గిరిజన రాజ్య స్వతంత్ర తను అయోధ్య చక్రవర్తులు గౌరవించారు,శ్రీ రాముడు తన పట్టాభిషేకానికి ఇతర రాజులలో పాటు గుహుడినీ పిలిచి సమానంగా గౌరవించాడు, అమెరికా,ఆస్ట్రేలియాలలో గిరిజనులను పెద్ద ఎత్తున ఊచకోతకు గురి అయ్యారని పేర్కొన్నారు.
ఈ సమ్మేళనంలో ఎస్టీలు, కోయ, గుత్తికోయ, కొండ రెడ్లు, ఎస్సీలు, మాల, మాదిగ కలసి మొత్తం 484 మంది చింతూరు,వి.ఆర్ పురం, కూనవరం, ఎటపాక వంటి నాలుగు మండలాల నుండి పాల్గొన్నారు.
భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేయడంతో సమ్మేళనం ప్రారంభం అయింది,ఆర్ఎస్ఎస్ 100 సం,ల సందర్భంగా జరుపుతున్న కార్యక్రమ వివరాలను గోదావరి విభాగ్ సంఘ చాలక్ శ్రీ రామచంద్రరాజు వివరించారు. శ్రీ సుబ్బయ్య వేదిక లక్ష్యాలను వివరించారు. సమ్మేళనంలో పూజ్య శ్రీ వేదయోగి మహరాజు,డా,పిరాట్ల శివరామ క్రిష్ణ, కంభాల శ్రీనివాస రావు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక చింతూరు డివిజన్ కమిటి అద్యక్షులు మొరక సంతోషి కుమారి, ప్రధాన కార్యదర్శి తూరం నారాయణ, ఉపాధ్యక్షులు/వెంకన్న బాబ, పుట్టి రాధా
కార్యదర్శులు మొరక హనుమంతు,సీసం అర్జున్, నాగుల శ్రీరాములులతో పాటు సభ్యులు తామ కుమారి, మరపాక శ్రీనివాస్,బంధం నాగేశ్వరరావు,అచ్చి రాజు, కాటుబోయిన సారయ్య, ఏసుపాక వెంకటేశ్వర్లు, మడిపల్లి కృష్ణ, పల్లంటి వెంకటేశ్వర్లు, సొండే రాజు తదితరులు పాల్గొన్నారు.





