News

వలసవాద ఆనవాళ్ల స్థానంలో స్వదేశీ గుర్తులు

189views
కేంద్రంలో ఎన్డీయే సారథ్యంలోని జాతీయవాద ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘‘స్వ’’ ఆధారిత పాలన ప్రారంభమైంది.భారత్ కి స్వాతంత్రం వచ్చి, ఇన్ని సంవత్సరాలు గడిచినా, ఇంకా వలసవాద విధానాలు, వలసవాద ఆధారిత పేర్లు ఇప్పటికీ కొన్నిచోట్ల చెలామణిలో వుండిపోయాయి. దీనిపై జాతీయవాదులు, దేశభక్తులు ఎప్పటి నుంచో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్రంలో జాతీయవాద ప్రభుత్వం వచ్చిన తర్వాత, జాతీయవాద విధానాలను అవలంబిస్తూ, వలసవాద ఆధారిత పేర్లను గానీ, విధానాలను గానీ ఒక్కొక్కటిగా తుడిచిపెట్టేస్తున్నారు.
తాజాగా కేంద్రం ఓ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. వలసవాద విధానాన్ని, వలసవాద ధోరణికి చరమ గీతం పాడే నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ రాష్ట్రపతి భవన్ లో బ్రిటీష్ జనరల్స్ చిత్రాలు కనిపించేవి. వారంతా ఆంగ్లేయాధికారులే. కానీ.. ఇప్పుడు వాటి స్థానంలో భారత్ కే గర్వకారణమైన 21 మంది పరమ వీర చక్ర అవార్డు గ్రహీతల చిత్రాలను వుంచారు. దేశం కోసం సర్వస్వ బలిదానాలు చేసిన 21 మంది పరమవీర చక్ర విజేతలకు ఘన నివాళులు అర్పించారు. విజయ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ గ్యాలరీని ప్రారంభించారు.
army
ఇక.. గతంలోనూ కేంద్ర ప్రభుత్వం సరిదిద్దినవి…
1. రాజ్ పథ్ కాస్తా.. కర్తవ్య మార్గ్ గా
ఢిల్లీలోని ఒకప్పుడు ‘‘రాజ్ పథ్ గా పిలువబడిన రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించిన మార్గం. దీనిని 1911 లో బ్రిటీష్ సర్కార్ తన రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చిన తర్వాత ఈ రహదారిని నిర్మించి, ‘‘కింగ్స్ వే’’ అని పేరు పెట్టారు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత దీనిని ‘‘రాజ్ పథ్’’ గా మార్చారు. ఆ తర్వాత కేంద్రంలో జాతీయవాద ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘‘కర్తవ్య పథ్’’ గా మార్చారు. ‘‘కింగ్స్ వే లేదా రాజ్ పథ్’’ అనేది బానిసత్వానికి చిహ్నం. దానిని శాశ్వతంగా తుడిచివేస్తూ ‘‘కర్తవ్య పథ్’’ అని పేరు పెట్టారు. అంటే ప్రతి నాయకుడికి గానీ, అధికారికి గానీ ఈ మార్గం తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది.
2. పీఎంఓ పేరు ‘‘సేవా తీర్థ్’’ గా…
వలసవాద పాలన అవశేషాలను తుడిచేస్తూ మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఢిల్లీలోని కొత్త ప్రధాని భవన సముదాయం పేరును ‘‘సేవాతీర్థ్’’ గా మార్చారు. దశాబ్దాలుగా సౌత్ బ్లాక్ లోని పీఎంవో నుంచి ప్రధానులు విధులు నిర్వర్తిస్తుండగా.. ఆ కార్యాలయం కొత్త భవనంలోకి మారనుంది. ఈ నేపథ్యంలోనే పేరు మార్పు చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలను న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్ క్లేవ్ లోకి మార్చనున్నారు. వాయుభవన్ కి పక్కన వున్న ఎగ్జిక్యూటివ్ ఎన్ క్లేవ్ 1 లో ఒక భవనాన్ని సేవాతీర్థ్ గా పిలవనున్నారు. దానిలో పీఎంవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
3. గవర్నర్ల అధికార నివాసాల పేర్లు కూడా మార్పు…
గవర్నర్ల అధికార నివాసాలకు ‘‘రాజ్ భవన్’’ అని పేరుంది. ఇకపై దీనిని ‘‘లోక్ భవన్’’ గా మార్చారు. ఇప్పటికే త్రిపుర, ఒడిశా, బెంగాల్, అసోం, తమిళనాడు, గుజరాత్ లాంటి రాష్ట్రాల గవర్నర్లు తమ బంగ్లాలను లోక్ భవన్ గా మార్చారు. వలసవాదానికి చిహ్నాలుగా వున్న పేరును తొలగించారు.
రైల్వే స్టేషన్ల పేర్లను కూడా మార్చిన ప్రభుత్వం
ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీ నగర్ రైల్వే స్టేషన్ గా పిలుస్తారు.
 
1. కర్రీరోడ్ – లాల్ బాగ్ గా మార్పు
 
2. శాండ్ హర్డ్స్ రోడ్ – డోంగ్రీ గా మార్పు
 
3. మెరైన్ లైన్స్ – ముంబాదేవి గా మార్పు
 
4. చార్ని రోడ్ – గిర్గావ్ గా మార్పు
 
5. కాటన్ గ్రీన్ – కలాచౌకి గా మార్పు
 
6. డాక్ యార్డ్ రోడ్డు – మజ్ గావ్ గా మార్పు
 
7. కింగ్స్ సర్కిల్ – తీర్థకర్ పార్శివనాథ్
 
8. ముంబై సెంట్రల్ స్టేషన్ ను నానా జగన్నాథ్ శంకర్ సేథ్ స్టేషన్ గా పేరు పెట్టారు.