News

ఇస్లామిక్ ఉగ్రవాదంపై పోరాడాలి: ట్రంప్

126views

ప్రపంచంమంతా ఏకమై ర్యాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదంపై పోరాడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. వైట్‌హౌస్‌లో జరిగిన యూదుల పండుగ ‘హనుక్కా’ వేడుకల్లో పాల్గొన్న ట్రంప్.. ఇటీవలే ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపిన ఘటనపై సంతాపం తెలిపారు. ‘దుర్మార్గమైన ర్యాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలూ కలిసి ఐక్యంగా నిలబడాలి. మేం అదే చేస్తున్నాం’ అని ఆయన చెప్పారు. తాను ఎప్పుడూ యూదులకు స్నేహితుడిగానే ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. యూఎస్ కాంగ్రెస్ ఇటీవలి కాలంలో యాంటీ-సెమిటిక్‌గా మారుతోందంటూ పరోక్షంగా ఇల్హాన్ ఒమర్ తదితరులపై విమర్శలు చేశారు. వీళ్లంతా యూదులను ద్వేషిస్తారని, ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, సెనేట్‌లో పరిస్థితి అంత దిగజారకున్నా.. అది కూడా మారుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.