News

మిథిలా చిత్రకళతో రామాయణ గాథ

154views

బిహార్‌లోని ముజఫర్‌పుర్‌ కళాకారుడు సుజిత్‌ శ్రీవాస్తవ రామాయణ కథను సంప్రదాయ మిథిలా చిత్రకళతో (మధుబని చిత్రలేఖనం) అందంగా చిత్రీకరించారు. రెండు నెలలు శ్రమించి రాముడి జననం, స్వయంవరం, వనవాసం, సీతాపహరణం, రామ-రావణ యుద్ధం వంటి ఘట్టాలను జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన సుజిత్‌ను అందరూ అభినందిస్తున్నారు. చీరలు, దుప్పట్ల వంటి వస్తువులపై సుజిత్‌ వేసే మిథిలా చిత్రాలతో ఏటా దాదాపు రూ.10 లక్షల ఆదాయం ఉంటోంది. అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత రామాయణ కథను మిథిలా చిత్రలేఖనం ద్వారా చెప్పాలనే ఆలోచన తనకు వచ్చిందని సుజిత్‌ తెలిపారు. దిల్లీ నుంచి వచ్చిన ఆర్డరు మేరకు 80 మీటర్ల వస్త్రంపై సంపూర్ణ రామాయణాన్ని చిత్రీకరించే పనిలో ప్రస్తుతం నిమగ్నమై ఉన్నట్లు చెప్పారు. 2014లో సుజిత్‌ను పెళ్లాడిన శ్వేత కూడా మిథిలా పెయింటింగ్‌ కళాకారిణే కావడంతో భర్తకు సహకరిస్తోంది.