
166views
దేశవ్యాప్తంగా “ఈకో క్లబ్” మిషన్ లైఫ్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల పిట్లంలో పర్యావరణానికి సంబంధించిన పోస్టర్స్ విడుదల చేశారు. దీనిలో భాగంగా ఇందూర్ విభాగ్ పర్యావరణ ప్రముఖ మాతాజీ శ్రీమతి లావణ్య మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ని వాడకూడదని చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయ రాదని, చెట్లను నాటాలని, స్టీల్ ప్లేట్స్ గ్లాస్‌లను వాడాలని ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మన అందరిది అని విద్యార్థులకు తెలియజేశారు. రాబోయే తరం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ చేయాలి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్వత్ సమితి కన్వీనర్ ఉడుగుల రాము, ప్రధానాచార్యులు గీత, పూర్వ విద్యార్థి జంగం ధర్మవీర్, పోషకులు, హితైషులు, శ్రేయోభిలాషులు, పాల్గొన్నారు.





