News

ధర్మవరం పట్టువస్త్రాల్లో అయోధ్య రాముడు

281views

ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో రాముడు మంగళవారంధర్మవరం పట్టువస్త్రాలతో దర్శనమిచ్చాడు. రామమందిర శిఖరంపై ధ్వజారోహణం సందర్భంగా గర్భగుడిలోని దేవతామూర్తుల అన్ని విగ్రహాలూ ధర్మవరం పట్టుతో మెరిసిపోయాయి. ధర్మవరానికి చెందిన పట్టుచీరల వ్యాపారి జింకా రామాంజినేయులు ప్రత్యేకంగా నేయించి నెల రోజుల క్రితం అయోధ్య రామాలయ కమిటీ ప్రతినిధులకు వీటిని అందజేశారు. ప్రత్యేక డిజైన్లతో చేనేత మగ్గాలపై వీటిని రూపొందించినట్లు రామాంజినేయులు తెలిపారు.