News

పామూరులో స్త్రీ శక్తి దివస్

172views

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో అక్షర కాలేజ్ నందు పామూరు మండల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి లక్ష్మీబాయి పూలదండలు వేసి ఘనంగా నివాళిలర్పించారు

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నెల్లూరు విభాగ్, రాష్ట్ర సేవికాసమితి శ్రీవిద్య విద్యార్థులతో మాట్లాడుతూ, ఝాన్సీ లక్ష్మీబాయి తొలి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా పోరాడి, భారతీయులలో స్వాతంత్య్ర కాంక్షను రేకెత్తించిన యోధురాలు, మహిళా పోరాట స్పూర్తికి నిదర్శనంగా నిలిచిన వీర వనిత ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అని కొనియాడారు. మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఏబీవీపీ సీనియర్ నాయకులు ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.