News

ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా స్టీల్ బ్యాంక్

126views

గ్రామ వికాస్ అన్నమయ్య జిల్లా రాయచోటి గ్రామీణ ఖండలో ఈ నెల 17వ తేదీన యర్రమరాజుగారిపల్లి ప్రభాత్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చేందుకు గ్రామ వికాస్ గ్రామ సమితిని ప్రారంభించారు

కార్తీక దీపోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత గ్రామంగా తయారుచేయడం కోసం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు 200 స్టీల్ ప్లేట్లు 200 స్టీల్ గ్లాసులుతో స్టీల్ బ్యాంక్ కు శ్రీకారం చూడుతూ గ్రామ పెద్ధలు మరియు గ్రామ వికాస్ గ్రామ సమితిని ప్రారంభించారు.ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా స్టీల్ పాత్రలను వినియోగించాలని సూచించారు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రాంత గ్రామ వికాస్ సంయోజక్ శ్రీ వడ్ల తిరుపతయ్య గారు పాల్గొన్నారు. 3 పంచాయతీల పరిధిలోని 10 గ్రామాల నుండి 150 మంది మహిళలు పురుషులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఈ స్టీల్ ప్లేట్లలోనే కార్తీక భోజనాలతో కార్యక్రమం పూర్తయింది.