News

ఆధ్యాత్మికత, ఆనందం అవగాహనల మేళవింపు తీర్థ, విహార యాత్ర.

234views

నంద్యాల జిల్లా, సంఘమిత్ర ఆవాసం విద్యార్థులుకు కార్తీకమాసం పురస్కరించుకొని ఆధ్యాత్మిక, ఆనంద, అవగాహన, తీర్థ విహార యాత్రను నిర్వహించారు.

యాత్రలో భాగంగా నంద్యాల నుండి బేతంచెర్లకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బిల్వం స్వర్ణ గుహలు, దగ్గర్లోని ముచ్చట్ల శ్రీ మల్లికార్జున స్వామి, రంగాపురం శ్రీ మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి, కాల్వబుగ్గ శ్రీ రామేశ్వరుడు, అగస్త్యముని ప్రతిష్ఠిత కొమ్మ చెరువు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమాలలో చిన్నారుల క్రమశిక్షణ, ప్లాస్టిక్ పట్ల వ్యతిరేకత, పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధత చూపరులను ఆకట్టుకుంది.

సదరు కార్యక్రమంలో సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ చిలుకూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీ జె వెంకటేశ్వర్లు, కార్యదర్శి శ్రీమతి సిరిగిరి విజయ శ్రీ, సహ కార్యదర్శి శ్రీ శ్రీ కరం సుందర్రావు, కోశాధికారి శ్రీ సముద్రాల నాగ రాజయ్య కార్యవర్గ సభ్యులు శ్రీ సింహ మల్లికార్జున, శ్రీ మోదాల ఆంజనేయులు, పూర్వ విద్యార్థి శ్రీ భూషణ్ ఆవాస్ ప్రముఖ శ్రీ గంగాధర్ పై వారందరూ కుటుంబ సమేతంగా తీర్థ విహార యాత్రలో పాల్గొని చిన్నారులతో ఆడి పాడి ఒకే కుటుంబంలా మెలిగారు.