News

కేరళలో ఎబివిపి కార్యకర్తలపై ఎస్‌ఎఫ్‌ఐ గూండాల దాడి

1.1kviews

కేరళలో వామపక్షాల దురాగతాలు తగ్గేటట్లు కనిపించడం లేదు. దానితో ఏకీభవించని ఏ గొంతునైనా హింసాత్మకంగా అణచివేయడంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) ముందంజలో ఉంది. తాజా దారుణ సంఘటనలో కేరళ కళాశాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) కార్యకర్తలపై ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితులను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు.

ఈ సంఘటన ఈ రోజు కొట్టాయంలోని వజూర్ వద్ద గల ఎన్ఎస్ఎస్ కాలేజీలో జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐ గూండాలు ఎబివిపి కార్యకర్తలపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో అనేక మంది ఎబివిపి కార్యకర్తలు గాయపడ్డారు. తీవ్ర రక్తగాయాలతో ఉన్న వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

నిన్న జరిగిన ఎబివిపి కాలేజీ యూనిట్ సమావేశానికి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరవడాన్ని సహించలేక ఎస్‌ఎఫ్‌ఐ ఆ కార్యక్రమాన్ని చిందరవందర చేసిందని ఎబివిపి తెలిపింది. ఎబివిపి నిర్వహించే సమావేశాలు మరియు కార్యక్రమాలకు ఇతర విద్యార్థులు హాజరుకాకుండా ఉండటానికి ఎస్‌ఎఫ్‌ఐ గూండాలు ఈ రోజు ఉదయం ఎబివిపి కార్యకర్తలపై దాడి చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ యూనిట్ కొంతకాలంగా కేరళలోని వివిధ కళాశాలల  క్యాంపస్‌లలో సమస్యలను సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఎబివిపి తెలిపింది.

ఎబివిపి కార్యకర్తలపై ఎస్‌ఎఫ్‌ఐ దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల కేరళలో ఎబివిపి విద్యార్థులు సిఎఎకు మద్దతు ఇచ్చినప్పుడు కూడా ఎస్ఎఫ్ఐ గూండాలు వారిపై దాడి చేసి వారిని దారుణంగా కొట్టారు. గత నెలలో సిఎఎకు మద్దతుగా మాట్లాడిన వర్మ కాలేజీకి చెందిన ఎబివిపి విద్యార్థులపై దారుణమైన దాడి జరగడంతో వారు తీవ్ర గాయాల పాలైన విషయాన్ని కూడా విద్యార్థులు ఆర్గనైజర్ కు వివరించారు.

ఇటీవల జెఎన్‌యులో కూడా ఎస్‌ఎఫ్‌ఐ గూండాలు ఎబివిపి విద్యార్థులపై దాడికి పాల్పడ్డ సంగతి పాఠకులకు తెలిసిందే.

Source: Organiser

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.