News

పంజాబ్ ప్రభుత్వ పాఠశాల గోడపై ఖలిస్థాన్ నినాదాలు

255views

ప్రభుత్వ పాఠశాల గోడపై గుర్తు తెలియని వ్యక్తులు ఖలిస్థాన్​ జిందాబాద్ అంటూ దేశ వ్యతిరేక నినాదాలు రాశారు. స్థానికులు తమ పిల్లలను స్కూల్​కు తీసుకెళ్లినప్పుడు వాటిని పరిశీలించారు. పంజాబ్​లోని బఠిండా జిల్లాలో ఆ ఘటన జరగ్గా, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని తల్వాండి సాబో పట్టణంలోని మన్వాలా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల గోడపై గుర్తు తెలియని వ్యక్తులు దేశ వ్యతిరేక నినాదాలు రాశారు.

ఖలిస్థాన్​ జిందాబాద్ నినాదాలు రాసి ఉండడం చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు షాకయ్యారు. ముఖ్యంగా పిల్లలు స్కూల్ వెళ్లేటప్పుడు గోడలపై వ్యతిరేక నినాదాలు కనిపించడం వల్ల స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని దుండగుల రాతలను పరిశీలించారు. అనంతరం నినాదాలకు సంబంధించి ఎలాంటి జాడ లేకుండా ఖలిస్థాన్​ జిందాబాద్ నినాదాలపై పెయింట్ వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోలీస్ అధికారి జస్మీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల గోడపై గుర్తు తెలియని వ్యక్తులు ఖలిస్తాన్ జిందాబాద్ నినాదాలు రాసినట్లు పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. సమాచారం ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకుని విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానిత వ్యక్తులను అరెస్టు చేశామని తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. స్థానిక శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే వ్యక్తులను అరెస్టు చేస్తామని, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇంతకు ముందు కూడా అనేక జిల్లాల్లో ఇటువంటి దేశ వ్యతిరేక గ్రూపులు ఏర్పడ్డాయని చెప్పారు. స్వేచ్ఛా ఉద్యమాల వంటి భావనలను ప్రేరేపించే రాతలు ప్రాంతీయ భద్రతకు సవాలు కావచ్చని అభిప్రాయపడ్డారు.